: జైట్లీకి న్యాయం దక్కేనా?... కేజ్రీపై పరువు నష్టం దావాపై విచారణ నేడే


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి న్యాయం దక్కుతుందో, లేదో నేటితో తేలిపోనుంది. డీడీసీఏ కుంభకోణంలో తనకు ప్రత్యక్ష పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించిన ఆప్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిధి దాటి తన కుటుంబ సభ్యులపైనా విమర్శలు గుప్పించారని జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీతో పాటు ఆప్ నేతలు పలువురు చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుకు భంగం కలిగిందని వాపోయారు. ఈ మేరకు తనకు జరిగిన పరువు నష్టానికి రూ.10 కోట్ల మేర పరిహారం ఇప్పించాలని ఆయన కేజ్రీ, ఆప్ నేతలపై పటియాలా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు నేడు విచారించనుంది.

  • Loading...

More Telugu News