: చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం... ఉగ్రదాడిపై పాక్ స్పందనిది!


పఠాన్ కోట్ ఉగ్రదాడిపై పాక్ స్పందించింది. భారత్ అందించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని చెప్పింది. "ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు మేము కృతనిశ్చయంతో ఉన్నాం. భారత ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. వారిచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నాం" అని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఈ ప్రకటనలో అంతకుమించిన వివరాలు లేకపోవడం గమనార్హం. ఒకే రీజియన్ లో, ఒకే విధమైన చరిత్ర కలిగిన భారత్, పాక్ దేశాలు శాంతి కోసం చర్చలను కొనసాగించాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని పాక్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు అభిలషించారు. పాక్ కూడా ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్న దేశమేనని అన్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News