: ఎల్బీ నగర్ టింబర్ డిపోలో ఎగసిన మంటలు... భయాందోళనల్లో స్థానికులు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎల్బీ నగర్ పరిధిలోని ఓ టింబర్ డిపోలో చెలరేగిన మంటలు క్షణాల్లో భారీ స్థాయికి చేరాయి. ఒక్క ఉదుటన పెద్ద పెట్టున ఎగిసిన మంటలతో అక్కడ కలకలం రేగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ఉన్నపళంగా ఎగసిన అగ్ని కీలల కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు.