: హైదరాబాద్ లో పోలీసుల అదుపులో వడ్డీ వ్యాపారులు!
హైదరాబాద్ లోని 56 మంది వడ్డీ వ్యాపారులను ఈరోజు దక్షిణ మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వడ్డీ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డబ్బుల కోసం బెదిరింపులకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న 30 మంది వడ్డీ వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 26 మంది వడ్డీ వ్యాపారులను పోలీసులు విచారిస్తున్నారు. 40 మందిపై పీడీ యాక్టు కేసు నమోదు చేయాలని పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.