: నవ్యాంధ్ర నిర్మాణానికి విద్యార్థుల నుంచి రూ 10 వసూలు!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములుగా చేసేందుకు ఆంధ్రా సర్కార్ నిర్ణయించింది. ప్రతి విద్యార్థి నుంచి రూ.10 వసూలు చేసి రాజధాని నిర్మాణంలో వారి పాత్ర కూడా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయా జిల్లాల విద్యాధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో సీమాంధ్రులు, ఎన్ ఆర్ఐలు భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశ్యంతో గతంలో ‘మై బ్రిక్ - మై అమరావతి’ అనే వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఆన్ లైన్ ద్వారా ఇటుకలను కొనుగోలు చేసి అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.