: చిన్నా.. భోజనం ఎలా ఉంది?: విద్యార్థితో కేటీఆర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని కోకాపేట్ లో భోజన మిత్ర వంటశాలను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఒక విద్యార్థిని కేటీఆర్ తన ఒడిలో కూర్చుబెట్టుకున్నారు. ఆ చిన్నారికి అరిటాకులో భోజనం వడ్డించారు. కేటీఆర్ ఆ బాలుడితో ముచ్చట్లాడారు. ‘భోజనం ఎలా ఉంది?’ అంటూ ఆ బాలుడిని ఆయన ప్రశ్నించగా, అతడు చిరునవ్వు చిందించాడు. కాగా, ఇస్కాన్, జీహెచ్ఎంసీ సంయుక్తంగా 'భోజన మిత్ర' పథకంను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా కేవలం రూ.5 కే భోజనం అందిస్తున్నారు.