: గ్రేటర్ పరిధిలో రూ.52 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ


ప్రకటించినట్టుగానే గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల నుంచి ఊరట కల్పించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రూ.52 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 100 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి బకాయిలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక 100 యూనిట్ల పైబడి విద్యుత్ వినియోగించేవారు మార్చి 31లోగా బకాయిలు చెల్లిస్తే సర్ చార్జీ రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News