: రాజధాని నిర్మాణంతో భూముల విలువ పెరిగింది: చంద్రబాబు


రాజధాని నిర్మాణంతో ఇక్కడి భూముల విలువ పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీని ఆయన సందర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పాల ఉత్పత్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయం చేసే రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ, పాల ఉత్పత్తితో నష్టపోయిన సందర్భాలు లేవని అన్నారు. వ్యాపార రంగంలోనూ మహిళలు రాణించాలని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News