: ‘రంగారెడ్డి’ కోర్టులో హీరో అల్లు అర్జున్!
తమ కుటుంబానికి సంబంధించిన ఒక సివిల్ కేసు విషయమై ప్రముఖ హీరో అల్లు అర్జున్ రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఈరోజు హాజరయ్యారు. సుమారు ఆరు సంవత్సరాల కిందట నార్సింగిలో జరిగిన ఒక భూతగాదా విషయమై రాహుల్ రోజ్ అనే వ్యక్తి అర్జున్ పై కేసు వేశాడు. ఇక్కడి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో ఈ కేసు విషయమై రెండు వర్గాల వారు రాజీకి వచ్చారు. అనంతరం అర్జున్ ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయాడు. కాగా, హీరో అల్లు అర్జున్ ఇక్కడి కోర్టుకు వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న కక్షిదారులు, న్యాయవాదులు ఆయన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు.