: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తాత్కాలిక సచివాలయం: మంత్రి నారాయణ
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపడుతున్నట్టు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. తాత్కాలిక సచివాలయాన్ని 29 గ్రామాల మధ్యలో నిర్మిస్తామని చెప్పారు. అయితే గ్రామ కంఠాలను ఎట్టి పరిస్థితుల్లోను కదిలించేది లేదన్నారు. ప్రధాన రహదారులు, ఎక్స్ ప్రెస్ వే కారణంగా గ్రామాలు పోతాయన్నది అపోహేనని ఆయన పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా ఇళ్లు తొలగిస్తే పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు.