: బర్మన్ సంగీతం ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది!: లతామంగేష్కర్


ఆర్.డి.బర్మన్ సంగీతం ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని ప్రముఖ గాయని, మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ అన్నారు. ఈరోజు ప్రఖ్యాత సంగీతకారుడు ఆర్.డి.బర్మన్ 22వ వర్ధంతి సందర్భంగా ఆమె ట్వీట్ చేసింది. బర్మన్ కు నివాళులర్పిస్తున్నట్లు ఆ ట్వీట్ లో పేర్కొంది. బర్మన్ సంగీత దర్శకత్వంలో లత ఎన్నో పాటలు పాడింది. కాగా, 1994 జనవరి 4వ తేదీన బర్మన్ ముంబయిలో మృతి చెందారు. ఆయన చివరిసారిగా సంగీతం అందించిన చిత్రం ‘1942 ఏ లవ్ స్టోరీ’. బర్మన్ మృతి చెందిన తర్వాత ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News