: ‘తెలంగాణ ఉద్యమాల చరిత్ర- రాష్ట్ర ఆవిర్భావం’ పుస్తకావిష్కరణ


ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి.ప్రకాశ్ రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర-రాష్ట్ర ఆవిర్భావం అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రకాశ్ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రను ఇప్పటి వరకు ఇంత సమగ్రంగా ఎవరూ గ్రంథస్తం చేయలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో జరిగిన పలు సంఘటనలను ఈ పుస్తక రచయిత ప్రత్యక్షంగా చూశారని అన్నారు. మన చరిత్ర గురించి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు తెలుసుకోవాలంటే పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాల్లో ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించే పోటీ పరీక్షలకు ఈ పుస్తకం రెఫరెన్స్ గా ఉపయోగపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News