: 200 మంది ముస్లింలను తొలగించిన యూఎస్ కంపెనీ


పని చేస్తున్న సమయంలో ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్న 200 మంది ముస్లిం ఉద్యోగులను అమెరికన్ సంస్థ తొలగించింది. కొలరాడోలోని ఫోర్ట్ మోర్గాన్ కేంద్రంగా పనిచేస్తూ, మాంసం ఉత్పత్తుల అగ్రగామిగా ఉన్న కార్జిల్ మీట్ సొల్యూషన్స్ సంస్థలో ఈ ఘటన జరిగింది. ఇందులో పనిచేసేవారిలో అత్యధికులు సోమాలియా నుంచి వలస వచ్చిన ముస్లింలే. వీరంతా కార్యాలయంలో పనిచేసే సమయంలో ప్రార్థనలకు అవకాశం కోరగా, తొలుత అంగీకరించిన సంస్థ, తరువాత తన విధానాన్ని మార్చుకున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. "మీరు ప్రార్థనలు చేసుకోవాలంటే, ఇళ్లకు వెళ్లి చేసుకోండి" అని చెప్పి వీరందరినీ తొలగిస్తున్నట్టు కంపెనీ యాజమాన్యం వెల్లడించినట్టు ట్రిబ్యూన్ డాట్ కాం ప్రకటించింది. "వీరంతా మంచి ఉద్యోగులు. చేసే పని మినహా మరే వ్యాపకాలు లేవు. వీరికి తమ ఉద్యోగం పోతుందన్న భయంతో పోలిస్తే, ప్రార్థనతో లభించే దేవుడి ఆశీర్వాదమే ముఖ్యం" అని అమెరికన్ - ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ ప్రతినిధి జైలానీ హుస్సేన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News