: ఉన్నతాధికారులతో ప్రధాని అత్యవసర సమావేశం!


ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి తిరిగివచ్చిన అనంతరం ప్రధాని ఈ సమావేశం నిర్వహించారు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడిపై చర్చించినట్లు సమాచారం. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, జాతీయ భద్రతా సంస్థ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు పఠాన్ కోట్ లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కాగా, ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చిచంపినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News