: అభ్యర్థుల ఎంపికలో ఎవరి సిఫారసులు అంగీకరించేది లేదు: కేసీఆర్
గ్రేటర్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగానే ఉంటుందని.. ఎవరి సిఫారసులు అంగీకరించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతున్నామని, ఈ ఎన్నికల్లో 80-85 సీట్లు గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఎంఐఎంతో ఎన్నికల పొత్తుపై ఇప్పటివరకు ఎలాంటి అవగాహనా లేదని చెప్పారు. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను హరీశ్ రావు తీసుకుంటారని అన్నారు. డివిజన్ల బాధ్యులు ఈ నెల 6 నుంచి ప్రచారం ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, గత పాలకుల వల్లే హైదరాబాద్ లో సమస్యలు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు.