: శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్నికల్లో రణతుంగ ఓటమిపాలు!


శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ ఓటమి పాలయ్యారు. ఎస్ఎల్సీ ఉపాధ్యక్షుడిగా పోటీపడ్డ రణతుంగ 22 ఓట్ల తేడాతో జయంత ధర్మదాస చేతిలో ఓడిపోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎస్ఎల్సీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య ఆదివారం నాడు ఈ ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉండగా, మరో జాతీయ స్థాయి క్రికెటర్, రణతుంగ తమ్ముడు నిషాంత్ రణతుంగ అధ్యక్ష స్థానానికి పోటీపడి పరాజయం పాలయ్యాడు. తిలంగా సుమతిపాలా 88 ఓట్లతో ఘన విజయం సాధించి మూడో సారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

  • Loading...

More Telugu News