: తెలంగాణలో ఐఐటీ, బిట్స్ తో ఇరిగేషన్ శాఖ అనుసంధానం: హరీశ్ రావు
సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పనుల్లో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి తెలంగాణలో ఐఐటీ, బిట్స్ ను ఉపయోగించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందుకుగాను ఐఐటీ, బిట్స్ తో ఇరిగేషన్ శాఖ అనుసంధానం చేయాలని, ఈ రెండు సంస్థలకు సంబంధించిన అధికారులతో చర్చలు జరపాలని అన్నారు. మార్చి 31 లోపు మిషన్ కాకతీయ ఫేజ్-1 గ్రౌండ్ పనులు పూర్తి చేయాలని, 15 రోజుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా ఏఈఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.