: మెక్సికో మహిళా మేయర్ దారుణ హత్య!
మెక్సికో మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే గిసెల్లా మోటా దారుణ హత్యకు గురయ్యారు. టెమెక్సికోలోని మేయర్ కార్యాలయంలోకి చొరబడ్డ సాయుధ వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపినట్లు మోర్లాస్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఇద్దరు వ్యక్తులను కాల్చివేశామని, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని మోర్లాస్ గవర్నర్ గ్రేసో రమిరెజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మెక్సికోలోని డ్రగ్స్, ఇతర నేరగాళ్ల ఆటకట్టిస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె హత్య జరిగి ఉండవచ్చని డెమోక్రటిక్ రివల్యూషన్ పార్టీకి చెందిన నేతలు పేర్కొన్నారు.