: ఇంగ్లాండు కౌంటీ యువ క్రికెటర్ మృతి!


ఇంగ్లాండు 'ససెక్స్ కౌంటీ క్రికెట్' యువ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మాథ్యూ హోబ్డెన్ (22) శనివారం మృతి చెందాడు. అతని మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియదు. స్కాట్లాండ్ లో నిన్న రాత్రి అతను మృతి చెందినట్లు ససెక్స్ కౌంటీ క్రికెట్ బోర్డు పేర్కొంది. యువ క్రికెటర్ మృతిపై తోటి క్రీడా కారులు, బోర్డు సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2014లో ససెక్స్ కౌంటీ నుంచి తన ఫస్ట్ క్లాస్ కెరీర్ ను మాథ్యూ ప్రారంభించాడు. గడిచిన రెండు సీజన్లలో మొత్తం మూడు ఫార్మాట్లలో అతను ఆడాడు. ఈ సీజన్ కు గాను పొటెన్షియల్ ఇంగ్లాండ్ పర్ ఫార్మెన్స్ ప్రోగ్రామ్ (పీఈపీపీ)కు సెలక్టయిన ఆరుగురు పేస్ బౌలర్లలో మాథ్యూ కూడా ఒకడు.

  • Loading...

More Telugu News