: నరేంద్ర మోదీ, కేసీఆర్ వేరు కాదన్న దత్తన్న


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే దిశగా కృషి చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తాను ప్రధానిని తీసుకొస్తానని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడ్డ జట్టులో తనతో పాటు మోదీ, కేసీఆర్ అందరూ సభ్యులేనని స్పష్టం చేశారు. తదుపరి రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక నిధులు, కొత్త రైళ్లు వచ్చేందుకు తన వంతు కృషిని చేస్తానని, బడ్జెట్ లో మూసీ నది సుందరీకరణకు నిధులు అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News