: తాజా ఘటన... పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో గ్రనేడ్ పేలుడు, నలుగురు సైనికులకు గాయాలు
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై నిన్నటి దారుణ ఉగ్రదాడిని మరువకముందే అదే చోట ఓ గ్రనేడ్ పేలిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఉగ్రవాదులను తుదముట్టించిన తరువాత, సెక్యూరిటీ సిబ్బంది భద్రతా దళాలతో కలసి ఎయిర్ బేస్ లోని అణువణువునూ పరిశీలిస్తున్న సమయంలో ఈ అవాంఛిత ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు వదిలిన ఓ గ్రనేడ్ పేలింది. ఈ ఘటనలో గాయపడ్డ నలుగురినీ ఆసుపత్రుల్లో చేర్చామని అధికారులు తెలిపారు. పఠాన్ కోట్ లో సోదాలు కొనసాగిస్తున్నామని వివరించారు.