: కేంద్రం ఏమిస్తుందో చూశాకే ఏపీ బడ్జెట్!
తీవ్రమైన నిధుల కొరత, లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఏపీ సర్కారు, 2016-17 బడ్జెట్ పై ఆచితూచి అడుగులు వేస్తోంది. కేంద్ర బడ్జెట్ లో భాగంగా రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయో పరిశీలించిన తరువాతనే బడ్జెట్ తీసుకురావాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా, లేదా ప్యాకేజీపై ఏదోఒకటి కేంద్రం ప్రకటిస్తుందన్న ఆశతో ఉన్న ఏపీ సర్కారు, నూతన బడ్జెట్ ను ఫిబ్రవరి 29 తరువాతే ఖరారు చేయాలని భావిస్తోంది. ఒకవేళ హోదా ప్రకటిస్తే, 90 శాతం నిధులు గ్రాంటుగా వస్తాయి కాబట్టి, 10 శాతం వాటాను చూపి, బడ్జెట్ పరిణామాన్ని పెంచుకోవచ్చన్నది యనమల ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై కేంద్రంతో బేరాలు సాగుతుండగా, 60 శాతం గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.