: ఉత్తరాదిన బాంబు భయాలతో ఆగిన పలు రైళ్లు


పఠాన్ కోట్ ఉగ్రదాడి తరువాత, బాంబులున్నాయన్న భయంతో ఉత్తరాదిన పలు రైళ్లను ఎక్కడికక్కడ ఆపేసిన అధికారులు వాటిని అణువణువూ పరిశీలిస్తున్నారు. ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో బాంబున్నట్టు అధికారులకు ఓ ఈ-మెయిల్ రావడంతో, రైలును ఘజియాబాద్ లో నిలిపి తనిఖీలు చేపట్టారు. ఆపై బాంబు లేదని నిర్ధారించుకుని రైలును కదలనిచ్చారు. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లలో తనిఖీలు జరిపిన, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఎక్కడా ప్రమాదం లేదని స్పష్టం చేశాయి. మరోవైపు అహ్మదాబాద్, కోల్ కతా తదితర ప్రాంతాల నుంచి బయలుదేరాల్సిన రైళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా కొన్ని రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News