: 'ఇండియన్ డాగ్స్' అంటూ తెలుగు విద్యార్థులకు బేడీలు వేసిన అమెరికా అధికారులు!


ఉన్నత చదువుల నిమిత్తం గంపెడాశతో అమెరికా చేరుకున్న వారు భరించలేని అవమాన భారంతో తిరిగి అదే విమానంలో ఇండియాకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు చేరుకున్న తెలుగు విద్యార్థులతో 'ఇండియన్ డాగ్స్ వస్తున్నాయి' అంటూ అవహేళనగా మాట్లాడిన అధికారులు, వారి చేతులకు బేడీలు వేశారు. తుపాకులు చూపి బెదిరించారు. గంటల పాటు నిర్బంధించి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన సందీప్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన అనిల్‌ కుమార్‌, గుంటూరు జిల్లాకు చెందిన కరుణాకర్‌ లకు ఎదురైన పరిస్థితి ఇది. సిలికాన్ వ్యాలీ వర్శిటీలో విద్యను అభ్యసించేందుకు వీరు వెళ్లారు. అన్ని పత్రాలూ ఉన్నా, తుపాకీతో బెదిరించి మరీ వెనక్కు పంపారు. తమకు తిండి కూడా పెట్టలేదని వాపోయారు. తమ తప్పేంటో అమెరికా చెప్పలేదని, కనీసం భారత ప్రభుత్వానికైనా చెప్పిందా? అని అడిగారు. కాగా, తాజాగా మరో 15 మంది భారత విద్యార్థులను అమెరికా తిప్పిపంపింది. పరిస్థితి విషమిస్తున్న సంకేతాలు వెలువడుతుండటంతో, విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికన్ అధికారులతో మాట్లాడుతున్నామని సుష్మా స్వరాజ్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News