: కాసేపట్లో నేతలతో కేసీఆర్ మరో సమావేశం!


నిన్న మంత్రిమండలితో 11 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు పలువురు మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ జరగనుండగా, గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా విడుదల చేయాల్సిన పార్టీ మేనిఫెస్టోపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రెండు రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తున్న కేసీఆర్, దానికి తుదిరూపు ఇవ్వడంతో పాటు, గ్రేటర్ లోని డివిజన్లలో ప్రచారం, సమన్వయం తదితరాలను ఒక్కో నేతకు అప్పగించే పనిని సైతం ఈ సమావేశంలో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయాలు తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News