: ఉగ్రవాదిపై తల్లి ప్రేమ... చనిపోయే ముందు ఏదైనా తినాలని సలహా!
భారత్ పై దాడి జరపాలని నిర్ణయించుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పఠాన్ కోట్ ప్రాంతం నుంచి పాకిస్థాన్ లోని తమ వారికి చేసిన నాలుగు ఇంటర్నేషనల్ కాల్స్ వివరాలను భద్రతా దళాలు గుర్తించాయి. వాటిల్లో ఓ కాల్ లో ఉగ్రవాది తన తల్లితో మాట్లాడగా, "చనిపోయే ముందు ఏదైనా తిను" అని ఓ తల్లి ఉగ్రవాదిపై తన మాతృప్రేమను చూపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిఘా అధికారులు ఈ ఫోన్ సంభాషణల రికార్డులను పరిశీలిస్తున్నారు.