: టీ-20 వద్దే వద్దు... యువతకు సచిన్ సంచలన సలహా!


క్రికెట్ ను అమితంగా ఇష్టపడే యువతకు సచిన్ టెండూల్కర్ ఓ సంచలన సలహా ఇచ్చారు. కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరాలంటే టీ-20పై మక్కువ పెంచుకోవద్దని, 'తుపాను' వంటి ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉండాలని సూచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తొలిసారి ద్విశతకం సాధించిన సచిన్, పొట్టి క్రికెట్ ను నమ్మితే, కెరీర్ ప్రమాదంలో ఉన్నట్టేనని అన్నారు. ముంబై అండర్-16 క్రికెటర్లతో సమావేశమైన సచిన్, యువకులకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఎవరినో చూసి కాపీ కొట్టవద్దని అన్నారు. ఈ సమావేశంలో సచిన్ తనయుడు అర్జున్ కూడా పాల్గొన్నాడు. కాగా, సచిన్ ఓకే ఒక్క ఇంటర్నేషనల్ టీ-20ని ఆడిన సంగతి తెలిసిందే. 2006లో జొహానస్ బర్గ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News