: అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే ఉగ్రదాడి...వెల్లడైన వాస్తవం


పంజాబ్ లోని పఠాన్ కోట్ భారత ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిందేనని రుజువయ్యే ప్రథమ సమాచారం లభ్యమైంది. నేటి తెల్లవారుజామున 3 గంటలకు భారత్ లోని పంజాబ్ లో ప్రవేశించిన ఉగ్రవాదులు కారులో వెళుతున్న ఎస్పీని, ఆయన వంట మనిషిని కొట్టి దించేసి, ఎస్పీ స్నేహితుడు రాజేష్ వర్మ గొంతు కోసి పడేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. గొంతు కోయబడ్డ రాజేష్ వర్మ వారు అక్కడి నుంచి కదలగానే గొంతుకు గుడ్డ కట్టుకుని దగ్గర్లోని గురుద్వారాకు పరుగెత్తుకెళ్లారు. అక్కడున్న వారికి ఫోన్ నెంబర్ ఇచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయమన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చడంతో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారేనని చెప్పారు. గతంలో భారత ప్రభుత్వం ఉరి తీసిన ఉగ్రవాది అఫ్జల్ గురు(పార్లమెంటుపై దాడి కేసులో దోషి)ను ఉరి తీసినందుకు ప్రతీకారంగా ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడుతున్నట్టు తెలిపారని ఆయన చెప్పారు. తీవ్రంగా తనను కొట్టిన ఉగ్రవాదులు పలు సందర్భాల్లో అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగా దాడులు చేస్తున్నట్టు చెప్పారని అన్నారు.

  • Loading...

More Telugu News