: తొలి సినిమాలోనే బీభత్సంగా నటించాడు: నాగశౌర్యకు రామ్ కాంప్లిమెంట్స్


'ఊహలు గుసగుసలాడే' సినిమా చూశానని తొలి సినిమా అయినప్పటికీ నాగశౌర్య బీభత్సంగా నటించాడని యువనటుడు రామ్ తెలిపాడు. 'కళ్యాణ వైభోగమే' ఆడియో వేడులో రామ్ మాట్లాడుతూ, మాళవిక, నాగశౌర్య జోడీ బాగుందని అన్నాడు. ఈ సినిమా పాటలు విన్నానని చాలా బాగున్నాయని రామ్ పేర్కొన్నాడు. అభిరుచి గల నిర్మాత శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకోవాలని ఆకాంక్షించాడు. నందినీ రెడ్డికి అలా మొదలైంది సినిమా అందించినంత గొప్ప విజయం అందించాలని కోరాడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరించిన రామ్, నటుడు సుమంత్, రాజ్ తరుణ్ కి ఆడియో సీడీలను అందజేశాడు.

  • Loading...

More Telugu News