: పాకిస్థాన్ కి ప్రధాని గట్టిగా సమాధానం చెప్పాలి: కాంగ్రెస్
పాకిస్థాన్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని పాకిస్థాన్ వెళ్లి వచ్చిన పది రోజుల్లోపే దాడులు జరగడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీనిని ప్రధాని తీవ్రంగా పరిగణించాలని సూచించింది. ఈ దాడి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి కాదని, భారత్ పై జరిగిన దాడి అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇలాంటి ఘటనలను తేలిగ్గా తీసుకోరాదని, దీనికి ఘాటైన సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తెలిపింది.