: పంజాబ్ లో పఠాన్ కోట్ దాడిని ఖండించిన పాక్


పంజాబ్ పఠాన్ కోట్ లోని భారత ఎయిర్ బేస్ పై ఉగ్రదాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సైనికులకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం నివాళులర్పించింది. వారి కుటుంబ సభ్యలకు సానుభూతిని ప్రకటిస్తూ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి దిగిన ఐదుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. వారిని జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News