: 'వంగవీటి' రంగా హత్యపై సినిమా ప్రకటించిన రాంగోపాల్ వర్మ!


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాను కన్నడ నాట విడుదల చేసిన వర్మ, అది విజయవంతమైందన్న వార్తల నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా కొత్త సినిమా ప్రకటించాడు. విజయవాడలో ఎప్పటి నుంచో బర్నింగ్ టాపిక్ గా ఉన్న వంగవీటి రంగా హత్యపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు 'వంగవీటి' అనే టైటిల్ని పెడుతున్నట్టు తెలిపాడు. మాఫియా, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలపై సినిమాలను అద్భుతమైన రీతిలో తెరకెక్కించే రాంగోపాల్ వర్మ, విజయవాడలో కళాశాల విద్య పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడతో ఉన్న అనుబంధం, ఆ నగరంపై ఉన్న అవగాహన, ముఠా కక్షల కథలను తెరకెక్కించడంలో ఉన్న నైపుణ్యం నేపథ్యంలో వంగవీటి రంగా జీవితకథను ఎలా డీల్ చేస్తాడోనన్న ఆసక్తి ప్రేక్షకులలో కలగడం సహజం. అలాగే, రాజకీయంగా, సామాజికంగా ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

  • Loading...

More Telugu News