: కేజ్రీవాల్ ప్లాన్ కు అమెరికా, ఫ్రాన్స్ మద్దతు


ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేస్తున్న సరి-బేసి సంఖ్యల విధానానికి అమెరికా, ఫ్రాన్స్ రాయబార కార్యాలయాలు మద్దతు పలికాయి. ఢిల్లీలో విదేశీ రాయబార కార్యాలయాల సిబ్బందికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ ఈ రెండు దేశాలకు చెందిన రాయబార కార్యాలయ సిబ్బంది స్వచ్చందంగా ఈ నిబంధనను పాటించారు. ఈ సందర్భంగా ఆ రెండు ఎంబసీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాలుష్య నియంత్రణ కోసం ఇందులో తాము పాలుపంచుకుంటామని తెలిపాయి. ఇప్పటికే తమ ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, లేదా కార్ పూలింగ్ విధానంలో ఆఫీసులకు చేరుకుంటున్నారని ఆ రెండు ఎంబసీలు వెల్లడించాయి. ఫ్రాన్స్ ఈ విధానం తమకు బాగా నచ్చిందని, కేవలం భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లోని ఫ్రాన్స్ ఎంబసీల్లో పని చేసే సిబ్బంది కూడా దీనిని అనుసరించేలా ప్రోత్సహించాలని భావిస్తున్నామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News