: ఇండియాలో 'ఆన్ లైన్' ఆహారాన్ని ఎక్కువగా ఆర్డర్ ఇస్తున్నది కోల్ కతా వాసులే!


ఒక్క క్లిక్ చేస్తే ఇష్టమైన ఆహారం మన ఇంటి ముందుకొస్తుంది. సామాజిక మాధ్యమాల హవా నేపథ్యంలో వివిధ రకాల వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. అందులో భాగంగా ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ బాగా విస్తృతమవుతోంది. దీంతో ఇండియాలో ఏ పట్టణ వాసులు ఇంటర్ నెట్ మాధ్యమంగా ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రముఖ ఫుడ్ పోర్టల్ జొమాటో వెల్లడించింది. ఇంటర్నెట్ ద్వారా కోల్ కతా వాసులు ఎక్కువ ఆహారం కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. అక్కడ సగటు ఆర్డర్ విలువ 690 రూపాయలు ఉంటుందని జొమాటో వెల్లడించింది. అలాగే అక్కడి నుంచే ఎక్కువ ఆన్ లైన్ ఆహార కొనుగోళ్లు జరుగుతున్నాయని జొమాటో వివరించింది. తరువాతి స్థానాల్లో ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబైలు ఉన్నాయని జొమాటో తెలిపింది. ఆన్ లైన్ లో ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద ఆర్డర్ విలువ 21,500 రూపాయలని వెల్లడించింది. అయితే ఈ ఆర్డర్ ఏ పట్టణం నుంచి వచ్చిందనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News