: తీహార్ జైలు ఖైదీల మధ్య ఘర్షణ...ఒక ఖైదీ మృతి


దేశంలో అతి పెద్దదైన ఢిల్లీలోని తీహార్ జైలు ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఖైదీ మృతి చెందాడు. జైలు నుంచి ఖైదీలను విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైదీల మధ్య మాటా మాటా పెరిగి, వాగ్వాదం చోటుచేసుకుంది, అది తీవ్ర రూపం దాల్చడంతో ఘర్షణగా మారిందని పోలీసులు తెలిపారు. వారిని అదుపు చేసే సరికే ఒక ఖైదీ మృతి చెందాడని జైలు సిబ్బంది తెలిపారు. కాగా, గతంలో జైలులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా, ఈ సారి మార్గ మధ్యంలో చోటు చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News