: మహిళను కాపాడి...హ్యాపీ న్యూఇయర్ చెప్పి...తిరిగిరాని లోకాలకెళ్లిపోయాడు!


తాను ప్రమాదంలో పడిపోతున్నానని తెలిసి, ఓ అమ్మాయి ప్రాణాలను కాపాడడమే కాకుండా, ఆమెకు 'హ్యాపీ న్యూ ఇయర్' చెప్పిన ఇరవై ఐదేళ్ల యువకుడి విషాద సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో మన్ హట్టన్ ప్రాంతంలో జరిగింది. నూతన సంవత్సరం వేడుకలు జరుగుతున్న రోజు రాత్రి అక్కడి ఓ భవనంలోంచి కిందకు దిగుతున్న స్టీఫెన్ హెవెట్ కు తానెక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తిందని గ్రహించాడు. తాను ప్రమాదంలో పడిపోతున్నాడని అర్థమైంది. దాంతో అదే సమయంలో ఆ లిఫ్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఎరూడ్ శాంజేష్ (42)అనే మహిళను లిప్టులోకి రానీవకుండా బలంగా తోసేసి, ఆమెకు 'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ గట్టిగా చెప్పాడు. మరుక్షణం అ లిఫ్ట్ తీగలు తెగి అది కిందపడిపోయింది. ఆ వెంటనే ఆమె విషయాన్ని అక్కడి వారికి చెప్పడంతో ఆగమేఘాలపై స్టీఫెన్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ కుర్రాడు మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రమాదంలో ఉన్నానని తెలిసి కూడా ఆమెను రక్షించడమే కాకుండా, 'హ్యాపీ న్యూ ఇయర్' విషెస్ చెప్పిన అతని ధైర్యానికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News