: కేజ్రీవాల్ కార్ పూలింగ్...సిసోడియా సైకిల్


ఢిల్లీలో సరి-బేసి సంఖ్య విధానం అమలు కావడంతో ఢిల్లీ వాసులు ఆఫీసులకు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. నిన్న నూతన సంవత్సరం కావడంతో విశ్రాంతి తీసుకున్న ఢిల్లీ వాసులు నేడు ఆఫీసులకు పరుగులు పెట్టారు. వీకెండ్ కావడంతో సాఫ్ట్ వేర్ మినహా మిగిలిన రంగాలకు చెందిన వారు సరి సంఖ్య నెంబర్లలో వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్ పూలింగ్ (కొందరు కలసి ఒకే కారులో వెళ్లడం)ను ఎంచుకున్నారు. ఆయన మంత్రి వర్గ సహచరుడు మనీస్ సిసోడియా సైకిల్ పై కార్యాలయానికి చేరుకున్నారు. మార్గ మధ్యంలో పలువురితో మాట్లాడుతూ, సరి-బేసి విధానానికి మద్దతు పలికి కాలుష్య నివారణలో పాలు పంచుకోవాలని పిలుపునిస్తూ ఆఫీసుకు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News