: రోజా సస్పెన్షన్ పై విచారణ... బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు


ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్ (టీడీపీ), గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైసీపీ), విష్ణుకుమార్ రాజు (బీజేపీ) ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేయనున్న కమిటీ 20 రోజుల్లోగా స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నివేదిక అందించనుంది. ఈ నివేదిక ఆధారంగా... రోజాపై సస్పెన్షన్ ను కొనసాగించాలా? లేక తగ్గించాలా? లేక మరింత కాలం పాటు పొడిగించాలా? అన్న దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు.

  • Loading...

More Telugu News