: రేపే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల... రాత్రికి వార్డుల రిజర్వేషన్లు ఖరారు


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇప్పటికే వార్డుల పునర్విభజనను పూర్తి చేసిన అధికారులు వార్డుల రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తు నేటి రాత్రికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాక ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలోనే గ్రేటర్ అధికారులు ఈ కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం భేటీ అయిన తెలంగాణ కేబినెట్ కూడా గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేటి రాత్రికి వార్డుల రిజర్వేషన్ల ఖరారు, రేపు సాయంత్రంలోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News