: ఏమ్మా... ఇంత లేటైతే ఎలా?: ‘తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్’ ఉద్యోగితో చంద్రబాబు ఆసక్తికర సంభాషణ


ఏపీలో మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ఉద్దేశించిన ‘తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్’ పథకాన్ని నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకంలో కీలక విభాగంగా పరిగణిస్తున్న కాల్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఏలూరు నగరంలోని సెంట్రల్ ఆసుపత్రికి, అదే నగరంలోని కాల్ సెంటర్ నుంచి ఎంత సమయంలోగా అంబులెన్స్ వస్తుందన్న విషయంపై ఆరా తీసిన చంద్రబాబు, అవతలి వైపు నుంచి మాట్లాడిన మహిళా ఉద్యోగికి షాకిచ్చారు. పది నిమిషాల్లో వచ్చే వీలున్నప్పటికీ, అరగంట సమయం ఎందుకు పడుతుందన్న చంద్రబాబు ప్రశ్నలకు ఆమె సారీ చెప్పారు. ఈ సంభాషణ కింది విధంగా జరిగింది. సీఎం: ఏమ్మా కాల్‌ సెంటరా..? కాల్‌ సెంటర్‌: నమస్కారం. మా నుంచి మీకు ఏ సేవలు కావాలి? సీఎం: మీ దగ్గర వాహనాలు ఉన్నాయా? కాల్‌ సెంటర్‌: ఉన్నాయి సార్‌ సీఎం: నేను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నా. తల్లీబిడ్డలను ఇంటికి పంపాలి. మీరు ఎంతసేపటిలో వాహనాన్ని పంపగలరు? కాల్‌ సెంటర్‌: వాహనం రావడానికి అర గంటకుపైగా పడుతుంది సార్‌ సీఎం: మీ దగ్గర ఎన్ని వాహనాలు ఉన్నాయి? కాల్‌ సెంటర్‌: సరిపడినన్ని ఉన్నాయి సార్‌ సీఎం: అలాంటప్పుడు అరగంట ఎందుకు? మరీ ఇంత లేటా? అందరికీ అందుబాటులో వైద్యం జరగాలని మనం 102 సర్వీసును ప్రారంభించాం. దీనిపై మీరు అవగాహన పెంచుకోండి. మొదటి రోజే ఇలా మాట్లాడితే ఎలా? కాల్‌ సెంటర్‌: పనితీరు మెరుగుపర్చుకుంటాం. పది నిమిషాల్లోనే వాహనం అందుబాటులో ఉంటుంది. థాంక్యూ సార్‌.

  • Loading...

More Telugu News