: సాయంత్రం దాకా టీఎస్ కేబినెట్ భేటీ... మధ్యలో మారియట్ హోటల్లో లంచ్!
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నేడు సుదీర్ఘ భేటీని నిర్వహించనుంది. సచివాలయంలోని ‘సి’బ్లాక్ లోని సీఎం సమావేశ మందిరంలో జరగనున్న ఈ భేటీ ఉదయం నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘంగా కొనసాగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, కొత్త బడ్జెట్ పై ప్రజెంటేషన్ తదితరాలపై చర్చ జరగాల్సి ఉన్న నేపథ్యంలో సుదీర్ఘ భేటీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. కీలక భేటీలో భాగంగా మధ్యాహ్నం మంత్రులు ఇళ్లకు కూడా వెళ్లడం లేదు. మధ్యాహ్న భోజనాన్ని సచివాలయానికే తెప్పించుకోవాలని తొలుత యోచించినా, ఆ తర్వాత సచివాలయానికి సమీపంలోని మారియట్ హోటల్ కు వెళ్లి భోజనం చేసి రావాలని కేబినెట్ సభ్యులు నిర్ణయించుకున్నారు. మంత్రులతో పాటు కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అధికారులు కూడా మారియట్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజనానంతరం మంత్రులు, అధికారులు మళ్లీ సచివాలయానికి చేరుకుంటారు.