: ఐఏఎస్ అధికారులతో ముగిసిన చంద్రబాబు సమావేశం
ఐఏఎస్ అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జన్మభూమి సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఫలాలు 2016లో చూస్తామని, ఐఏఎస్ లు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని బాబు పేర్కొన్నట్లు సమాచారం. టెక్నాలజీని అన్ని శాఖల్లో అమలు చేయడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలందించవచ్చని, ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకంపై పీఎంఓ ఆరా తీసిందనే విషయాన్ని బాబు ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.