: కెప్టెన్ గా ఫర్వాలేదు...ఆటతీరు మాత్రం మారాలి!: కోహ్లీపై గుండప్ప విశ్వనాథ్
విరాట్ కోహ్లీ ఆటతీరు మెరుగు పరుచుకోకపోతే అతని కెరీర్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని వెటరన్ గుండప్ప విశ్వనాథ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ గా కోహ్లీ ఓకే కానీ, టెస్టుల్లో అతని ఆటతీరు ఎంతో మారాలని ఆయన సూచించాడు. వన్డేలు, టీట్వంటీలకు కోహ్లీ బ్యాటింగ్ సరిపోతుందని అయన చెప్పాడు. ఈ రెండు ఫార్మాట్లలో షాట్లు ఆడాల్సి ఉంటుందని, అలాంటప్పుడు సాహసోపేతమైన ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని, అప్పుడు విఫలమైనా పెద్దగా బాధపడక్కర్లేదని ఆయన తెలిపాడు. అదే టెస్టుల్లో సాహసోపేతమైన షాట్లు ఆడాల్సిన అవసరం లేదని, ఎంపిక చేసుకున్న షాట్లు ఆడితే సరిపోతుందని, కోహ్లీ మాత్రం నిర్లక్ష్యంగా ఒకేరకమైన షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే కోహ్లీ కెరీర్ ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.