: టీడీపీని చంద్రబాబే లెక్కలోకి తీసుకోవడం లేదు: కేటీఆర్


తెలంగాణ టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే లెక్కలోకి తీసుకోవడం లేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాదులో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీది ముగిసిన అధ్యాయమని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో హైదరాబాదులోని సీమాంధ్రులు టీఆర్ఎస్ ను నమ్మలేదని, అందుకే గ్రేటర్ లో టీఆర్ఎస్ సత్తాచాటలేదని ఆయన వెల్లడించారు. ఇప్పుడా పరిస్థితి లేదని, హైదరాబాదులో రాజకీయ పరిస్థితులు మారాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ 80 సీట్లను సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ కేవలం 10 సీట్లకు పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రమ్మని పిలిచినా రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News