: షూటింగ్ లేనప్పుడు తక్కువ మేకప్ వేసుకుంటా: అతియాశెట్టి
షూటింగ్ లేనప్పుడు తాను మేకప్ ఎక్కువగా వేసుకోనని బాలీవుడ్ నటి అతియా శెట్టి చెప్పింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతియా మాట్లాడుతూ, తన సౌందర్య రహస్యాన్ని వెల్లడించింది. ఇప్పటికీ ప్రతి ఆదివారం తన తలకు బామ్మ కొబ్బరినూనె రాస్తుందని చెప్పింది. తనకు గుర్తున్నప్పటి నుంచి ఈవిధంగా చేస్తూనే ఉంది. అందుకే తనకు స్పా లేదా ఇతర టెక్నిక్ లు అవసరం లేదని చెప్పింది. తన శిరోజాలు అంత అందంగా ఉండటం వెనుక రహస్యమిదేనని అతియా చెప్పేసింది. భారతీయ మహిళల కళ్లు చాలా అందంగా ఉంటాయని ఆమె అంది. తాను వాడిన మొట్టమొదటి మేకప్ ప్రొడక్టు కాటుక అని చెప్పింది.