: ఈ ఏడాది విపత్కర పరిస్థితులు తప్పవు: విశాఖ శారదా పీఠాధిపతి
ఈ ఏడాది దేశానికి, రాష్ట్రానికి విపత్కర పరిస్థితులు తప్పవని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిజీ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, నాయకులు చాలా విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశముందన్నారు.