: కాంగ్రెస్ బీజేపీ లాంటిది కాదు...స్నేహం కోరుకుంటోంది: చిదంబరం


కాంగ్రెస్ పార్టీ బీజేపీలా ద్వంద్వ వైఖరి అవలంబించదని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ తో స్నేహానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని అన్నారు. బీజేపీలా నిన్నటి వరకు విద్వేషాలు విరజిమ్మి ఒక్కసారిగా యూటర్న్ తీసుకోలేదని విమర్శించారు. హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు, యూటర్న్ లు శాశ్వత పరిష్కారం కాజాలవని ఆయన హితవు పలికారు. లోక్ సభలో 67 బిల్లులు, రాజ్యసభలో 45 బిల్లులు పాస్ అవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించాలని ఆయన సూచించారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని, ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంపై తమ పార్టీని విమర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎంతగా సహకరిస్తున్నా ప్రధాని విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News