: అవన్నీ మా సినిమాలతోనే ప్రారంభం: బాలకృష్ణ
తెలుగు సినీ ప్రేక్షకులు నందమూరి సినిమాల్లోని డైలాగులనే ఆస్వాదిస్తారని ప్రముఖ టాలీవుడ్ నటుడు బాలకృష్ణ తెలిపారు. తమ సినిమాలతోనే తెర ముందు చిందులు, పూజలు, ఈలలు, గోలలు, కాగితాలు విసరడం వంటి సంప్రదాయాలు నెలకొన్నాయని ఆయన చెప్పారు. అప్పట్లో తన తండ్రి గారి సినిమాలకు బళ్లు కట్టుకుని మరీ వెళ్లి చూసేవాళ్లని, ఆ తరువాత ఆ సంప్రదాయం తనకు మాత్రమే కొనసాగిందని ఆయన చెప్పారు. తమ సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల ఈలలు, గోల ఉంటాయని, అది బీసీ సెంటర్లైనా, 70 ఎంఎం థియేటర్లైనా, మల్టీప్లెక్స్ మాల్స్ అయినా సందడి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. డిక్టేటర్ లో హీరోయిన్ గా అంజలి మంచి పెర్ఫార్మెన్స్ చేసిందని, విలన్ గా రతి అగ్నిహోత్రి, సోనాల్ చౌహాన్ చక్కగా నటించారని ఆయన వివరించారు.