: జంటనగరాల్లో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు!
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ జంట నగరాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం న్యూ ఇయర్ ఒక్క రోజే రూ.70 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. కాగా, నూతన సంవత్సరం రాక సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి కుర్రకారు హంగామా మొదలుపెట్టారు. మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, రిసార్టులు, స్టార్ హోటళ్లు, పబ్ లు కిటకిటలాడాయి. నిన్న కూడా మద్యం అమ్మకాల జోరు విపరీతంగా జరిగింది. కాగా, న్యూ ఇయర్ కు ముందు తర్వాత కూడా మద్యం విక్రయాలతో అబ్కారీ శాఖకు లాభం చేకూరింది.