: ఓట్ల కోసమే కేసీఆర్ 'ఆంధ్రా సోదరులు' అంటున్నారు: రేవంత్ రెడ్డి


హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులంతా తమ సోదరులేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించడంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓట్ల కోసమే ఆంధ్రా సోదరులు అంటున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ఆంధ్రావారిపై ద్వేషభావం ప్రదర్శించలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రా వంకతో తొలగించిన 26 కులాలను తిరిగి బీసీల జాబితాలో చేర్చుతారా? అని రేవంత్ నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సీఎంకు సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై సీబీఐ కేసు ఉన్నందునే యాగానికి ప్రధానమంత్రి రాలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తాగి ఇంట్లో పడుకున్న రోజుల్లోనే సైబరాబాద్ ను చంద్రబాబు నిర్మించారని, ఈ నగరం ఆయన శ్రమేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News